సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' జైలర్ 2 ' పైరసీ బారిన పడింది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్న తరుణంలో.. సెట్స్ నుంచి కొన్ని కీలక దృశ్యాలు లీక్ అయ్యాయి. ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల దళపతి విజయ్ సినిమా 'జన్ నాయగన్' పైరసీ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మరవకముందే .. ఇప్పుడు రజనీ సినిమా కూడా పైరసీకి గురికావడం సినీఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
సన్ పిక్చర్స్ సీరియస్ వార్నింగ్
'జైలర్ 2' మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుండటంతో నిర్మాణ సంస్థం సన్ పిక్చర్స్ సీరియస్ అయింది. మా యాంటీ పైరసీ టీమ్ నిరంతరం సోషల్ మీడియాను పర్యవేక్షిస్తోంది. లీకైన వీడియోలను షేర్ చేసినా, ప్రోత్సహించినా సదరు అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మీడియా ప్రతినిధులు, ఫ్యాన్స్ ఈ వీడియో క్లిప్స్ ను షేర్ చేయవద్దని కోరింది.
క్రేజీ కాంబోలో.. పవన్ ఎంట్రీ..?
ఈ మూవీలో రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్ గా తన విశ్వరూపాన్ని చూపించనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్ లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వైపు ఈ సినిమాలో ఒక శక్తివంతమైన పాత్ర కోసం బాలీవుడ్ బాద్ షా ఎంపిక చేశారు. అయితే తన తదుపరి చిత్రం 'కింగ్' కోసం ఈ ఆఫర్ ను తిరస్కరించారు. షారుఖ్ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
►ALSO READ | Pallichattambi Review: టొవినో థామస్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఎలా ఉందంటే..?
హై అలర్ట్‌లో చిత్ర పరిశ్రమ
ఇటీవలే దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా విడుదలకు ముందే ఏకంగా ఫుల్ మూవీ లీక్ అయ్యి పెద్ద దుమారాన్నే రేపింది. ఈ కేసులో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైలర్ 2 విషయంలో కూడా అలాంటి ప్రమాదం పొంచి ఉండటంతో మేకర్స్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను జూన్ 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లీకేజీల వల్ల సినిమా హైప్ దెబ్బతినకుండా చూడాలని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.

