
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు నిందితులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో హత్య కేసులో నిందితుడిగా ఉన్న పెరారివాలన్ కు నిర్దేశించిన గైడ్ లైన్సే మిగిలిన దోషులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. 2022 మే 18న పెరరివాలన్ ను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును మిగిలిన దోషులకు కూడా వర్తింపజేసింది సుప్రీంకోర్టు.
దీంతో దోషులు నళిని, జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్ర రాజా, శ్రీహరన్ లను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. దోషులు జైలులో మంచి నడవడికతో ఉన్నారని, జైలులో ఉన్న సమయంలో వివిధ డిగ్రీలు పూర్తి చేశారని కోర్టు తెలిపింది. అలాగే సెప్టెంబర్ 9, 2018లో దోషులను విడుదల చేయాలంటూ అప్పటి తమిళనాడు కేబినెట్ కూడా సిఫారసు చేసినట్లు కోర్టు తెలిపింది.