జూన్​2న 9 వేల మందికి యువ వికాసం... మొదటి విడతలోరూ.లక్షలోపు వారికి..

జూన్​2న 9 వేల మందికి యువ వికాసం... మొదటి విడతలోరూ.లక్షలోపు వారికి..
  • మిగతా వారికి జులై, సెప్టెంబర్​లో..

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో జూన్ 2వ తేదీన 9,219 మందికి రాజీవ్ యువ వికాసం లోన్లు ఇచ్చేందుకు అధికారుల సిద్ధమయ్యారు. అయితే, రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు లబ్ధిదారుల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయ్యింది. 3,721మంది రూ.50 వేల రుణాలు మంజూరు చేయగా, 5,498 మందికి రూ.లక్ష లోన్లు  అందజేయనున్నారు. 

జిల్లాలో మొత్తం 1,28,763  దరఖాస్తులు రాగా, వీటిని వెరిఫికేషన్ చేయడానికి బ్యాంకర్లకు అందజేశారు. రూ.2 లక్షల లోపు వారికి జులైలో, రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ఉన్నవారికి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో లోన్లు అందజేయనున్నట్టు సమాచారం.