చపాతీ కర్రీ ... రాజ్మా టాకో .. ప్రోటీన్ ఫుడ్.. జస్ట్ 20 నిమిషాల్లో రడీ..!

చపాతీ కర్రీ ... రాజ్మా టాకో ..  ప్రోటీన్ ఫుడ్.. జస్ట్ 20 నిమిషాల్లో రడీ..!

రాజ్మా టాకో  ఇది  ఒక రుచికరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే శాఖాహార వంటకం. ఉడికించిన రాజ్మాను మసాలాలతో కలిపి, టాకో షెల్స్ (లేదా చపాతీ)లో ఉల్లిపాయలు, టమోటాలు, చీజ్ మరియు సాస్‌లతో నింపి దీనిని తయారు చేస్తారు. దీనిని చపాతీల్లో  తింటే సూపర్ గా ఉంటుంది.   జస్ట్​ 20 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . 

రాజ్మా టాకో తయారీకి కావాల్సినవి 

  • రాజ్మా: ఒక కప్పు
  • మొక్కజొన్న గింజలు: అర కప్పు
  • బీన్స్ తరుగు: పావు కప్పు
  • శనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు
  •  కారం: అర టీస్పూన్ 
  • మిరియాలపొడి: పావు టీస్పూన్ 
  • ఉప్పు, ఉల్లిగడ్డ, టొమాటో, కొత్తిమీర, నూనె: సరిపడా, 
  • వాము: చిటికెడు

రాజ్మా టాకో తయారీ : రాజ్మాను ఉప్పు వేసిన నీటిలో ఉడికించి, వడకట్టి పక్కనపెట్టాలి. బీన్స్, మొక్కజొన్న గింజల్ని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి.

ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి. అందులో రాజ్మా, శనగపిండి, కారం, ఉప్పు, మిరియాల పొడి, వాము వేసి బాగా కలపాలి.

ఆ మిశ్రమాన్ని చపాతీపై పూసి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చాలి. ఆపై ఉల్లిగడ్డ, టొమాటో, కొత్తిమీర తరుగు వంటి వాటితో గార్నిష్ చేసి, చపాతీని ఒక మడతపెట్టేస్తే రాజ్మా టాకో రెడీ. కావాలంటే దీన్ని చపాతీ లేకుండా డైరెక్ట్​గా పాన్​ మీద కాల్చుకుని టిక్కీలా తినేయొచ్చు.

►ALSO READ | మూంగ్ దాల్ ఇడ్లీ... అదిరిపోయే టేస్ట్ తో సూపర్ బ్రేక్ ఫాస్ట్