జాతీయ భద్రతపై రాజ్‌‌నాథ్ సమీక్ష

జాతీయ భద్రతపై రాజ్‌‌నాథ్ సమీక్ష
  • సీడీఎస్,  త్రివిధ దళాధిపతులు హాజరు

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ శుక్రవారం జాతీయ భద్రతా పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి, డిఫెన్స్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. దేశంలో భద్రతా పరిస్థితికి సంబంధించిన ప్రతి అంశాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. 

గురువారం రాత్రి జమ్మూ, పఠాన్‌‌కోట్, ఉధంపూర్ సహా మరికొన్ని ప్రదేశాలలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం మిసైల్స్, డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలను ఇండియన్ సోల్జర్లు విజయవంతంగా న్యూట్రలైజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్రన్ సరిహద్దులో భద్రతా పరిస్థితి, మన సాయుధ దళాల తదుపరి కార్యాచరణ సంసిద్ధతను రివ్యూ చేయడానికి రాజ్‌‌నాథ్ సింగ్ ఈ సమావేశం నిర్వహించారని సమాచారం.