రక్షణ రంగంలో ఆవిష్కరణల స్వర్ణయుగం..కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్

రక్షణ రంగంలో  ఆవిష్కరణల స్వర్ణయుగం..కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో ఆవిష్కరణల స్వర్ణయుగం ప్రారంభమైందని రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితు లు, భౌగోళిక రాజకీయ మార్పుల మధ్య మన దేశం 'ప్రోఆక్టివ్' వైఖరి అవలంబిం చాలని, తద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

మంగళ వారం ఢిల్లీలోని మానెక్‌‌‌‌‌‌‌‌షా సెంటర్​లో రక్షణ రంగం పురోగతికి సంబంధించి రెండు రోజుల 'స్వావలంబన్2025' కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి చీఫ్ గెస్ట్​గా రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ హాజరై, మాట్లాడారు. "మన రక్షణ రంగం ఆవిష్కరణల స్వర్ణ యుగంలోకి ప్రవేశిస్తోంది.  

దేశ రక్షణ వ్యవస్థ చిన్న చిన్న ప్రాజెక్టులతో సంతృప్తి పడకూడ దు. ఫైటర్ జెట్లు, సబ్‌‌‌‌‌‌‌‌మెరైన్లు, మిస్సైల్స్, సైబర్ వెపన్స్, స్పేస్ వార్‌‌‌‌‌‌‌‌ఫేర్ తయారు చేయగల ప్రపంచ స్థాయి ఆయుధ వ్యవస్థగా ఎదగాలి” అని పేర్కొన్నారు.