
భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుజరాత్ లో పర్యటించనున్నారు. గురువారం(మే16న) భుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించనున్నారు. ఇటీవల భుజ్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ విశ్వప్రయత్నం చేసింది. అయితే భారత సైన్యం పాక్ దాడులను విజయవంతంగా తిప్పకొట్టింది. భుజ్ ఎయిర్ బేస్ పై డ్రోన్ల దాడి విఫలం తర్వాత అక్కడ గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో రాజ్ నాథ్ సింగ్ భారత సాయుధ దళాల కార్యచరణ, భద్రతా చర్యలను పరిశీలించనున్నారు.
మే 9 అర్థాత్రి భుజ్ వైమానిక స్థావరంలోకి పాకిస్తాన్ చొరబడేందుకు ప్రయత్నించింది. తెల్లవారుజామున 26 కి పై ప్రదేశాల్లో చొరబాటుకు ప్రయత్నించింది.ఉధంపూర్, భుజ్, పఠాన్‌కోట్,బటిండాలోని ఎయిర్ పోర్టులను వైమానిక స్థావరాలు వంటి కీలక స్థావరాలను లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. అయితే భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పకొట్టింది.
భారత వైమానిక దళంలో రుద్ర మాతా వైమానిక దళ స్టేషన్ భుజ్లో అత్యంత కీలకమైంది.ఈ స్టేషన్ భుజ్ ఎయిర్ పోర్టుతో దాని రన్ వేను పంచుకుంటుంది.
రాజస్థాన్ లో భుజ్ వైమానిక దళ స్టేషన్..రక్షణ, నిఘా వ్యవస్థకు కీలకస్థావరం.ఇది సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ తో కలిసి పనిచేస్తుంది.
మంగళవారం ఆందపూర్ ఎయిర్ బేస్ ను ప్రధాని మోదీ సందర్శించారు. పంజాబ్ లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని పరిశీలించారు. ఆపరేషన్ లో భాగంగా సిబ్బందితో మాట్లాడారు.
ఆదంపూర్ ఎయిర్ బేస్ భారత్ వైమానిక దళం పశ్చిమ వైమానిక కమాండ్ పరిధిలోకి వస్తుంది. ఆపరేషన్ సిందూర్ తో సహా అనేక కార్యకలాపాలు ఇక్కడినుంచే జరిగాయి. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర చౌదరి, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ నేతృత్వంలో ఈ మిషన్లను నిర్వహించారు.
పశ్చిమ వైమానిక కమాండ్ భారత వైమానిక దళం అత్యంత కీలకమైన కమాండ్లలో ఒకటి. ఇది జమ్మూకాశ్మీర్ నుంచి రాజస్థాన్ వరకు , హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ తో సహా వ్యూహాత్మక ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రాంతంలో అత్యంత సున్నితమైన సరిహద్దులు, వైమానిక స్థావరాలు ఉన్నాయి. ఇది పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఏదైనా వైమానిక సైనిక చర్యకు అయినా ప్రధాన కేంద్రంగా ఉంటుంది.