అక్టోబర్ 16 రాష్ట్రానికి రాజ్​నాథ్​సింగ్

అక్టోబర్ 16 రాష్ట్రానికి రాజ్​నాథ్​సింగ్

హైదరాబాద్, వెలుగు: రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​సోమవారం రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్​ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్మీ హెలిక్యాప్టర్​లో బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు హుజూరాబాద్​కు వెళ్తారు.

అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.30కు హుజూరాబాద్​నుంచి బయల్దేరి 3.10 గంటలకు శంషాబాద్​ఎయిర్​పోర్టుకు వస్తారు. మహేశ్వరంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం 5.40 గంటలకు శంషాబాద్​ నుంచి ఢిల్లీకి తిరిగి బయల్దేరుతారు.