లా నూసియా: తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్.. బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్ టోర్నీలో బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన మెన్స్ 60 కేజీల సెమీస్‌లో హుస్సాముద్దీన్ 0–5తో కియోమా అలీ అహ్మదియా (కెనడా) చేతిలో ఓడాడు. జాదుమణి సింగ్ (55 కేజీ) 0–5తో మకుమద్ సబ్యర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో, హితేశ్ గులియా 0–5తో టోర్కెహాన్ సబ్యర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓడి కాంస్యాలతో సంతృప్తి చెందారు.
విమెన్స్ 75 కేజీ సెమీస్‌లో లవ్లీనా బోర్గోహైన్ 5–0తో రోసీ ఎక్లెస్ (వేల్స్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రీతి పవార్ (54 కేజీ) , పూనమ్ (54 కేజీ), మంజు రాణి (48 కేజీ), నీతూ గంగాస్ (51 కేజీ), అరుంధతి చౌదరీ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టారు.
