కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37) టాప్ స్కోరర్. ఆరంభంలో పాక్ బౌలర్ల ధాటికి 31 రన్స్‌కే మ్యాక్స్ ఓ డౌడ్ (5), మైకేల్ లెవిట్ (24) వెనుదిరిగారు. ఈ దశలో బాస్ డి లీడె (30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అకెర్‌మన్ (20)తో కలిసి మూడో వికెట్‌కు 34, ఎడ్వర్డ్స్‌తో నాలుగో వికెట్‌కు 40 రన్స్ జత చేసి ఔటయ్యాడు. మధ్యలో మరోసారి విజృంభించిన పాక్ బౌలర్లు వరుస విరామాల్లో జాచ్ లయన్ కాచెట్ (9), లగాన్ వాన్ బీక్ (0), ఆర్యన్ దత్ (13), వాన్ డెర్ మెర్వ్ (4), పాల్ వాన్ మీకెరెన్ (0)ను ఔట్ చేశారు. ఫలితంగా 42 రన్స్ తేడాలో ఎనిమిది వికెట్లు పడటంతో డచ్ భారీ స్కోరు చేయలేకపోయింది. సల్మాన్ మీర్జా 3, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 148/7 స్కోరు చేసి నెగ్గింది. స్టార్టింగ్ నుంచే సాహిబ్జాదా ఫర్హాన్ (47), సైమ్ అయూబ్ (24) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 27 రన్స్ జోడించారు.
కానీ మధ్యలో డచ్ బౌలింగ్ ధాటికి కెప్టెన్ సల్మాన్ ఆగా (12), బాబర్ ఆజమ్ (15), ఉస్మాన్ ఖాన్ (0), షాదాబ్ ఖాన్ (8), మహ్మద్ నవాజ్ (6) వరుస విరామాల్లో వెనుదిరిగారు. ఫలితంగా16 రన్స్ తేడాతో ఐదు కీలక వికెట్లు పడటంతో పాక్ ఎదురీత మొదలుపెట్టింది. ఇక 114/7 వద్ద వచ్చిన ఫహీమ్ అష్రఫ్ భారీ షాట్లతో విరుచుకుపడి మరో 3 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. ఆర్యన్ దత్, పాల్ మీకెరెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫహీమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
