Kanthara prequel : కాంతార 2లో రజనీకాంత్..!

Kanthara prequel : కాంతార 2లో రజనీకాంత్..!

దక్షిణాదిలో లో బడ్జెట్ సినిమాగా రిలీజై అన్ని భాషల్లోనూ ఘన విజయం సొంతం చేసుకున్న మూవీ కాంతార. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార 2 తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హీరో రిషబ్ శెట్టి కాంతార 2కు సంబంధించి ప్రిలిమినర్ వర్క్ నడుస్తోందని చెప్పారు. కాంతార 2లో రజినీకాంత్ కనిపించనున్నారా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రిషబ్ ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోవడం ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. అది రూమర్‌ అయితే రిషబ్‌ స్పందించే వాడని.. ఏమీ చెప్పలేదంటే ‘కాంతార2’లో రజనీ కనిపించడం ఖాయమేనన్న వార్తలు చక్కర్లు కొడుతున్నారు. సోషల్ మీడియాలోనూ హిట్ మూవీలో సూపర్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు రజనీకాంత్ సైంత్ కాంతార మూవీ, రిషబ్ శెట్టిపై అవకాశం దొరికినప్పుడల్లా ప్రశంసలు కురించడం, ఈ మధ్యనే రిషబ్ ను ఇంటికి పిలిచి మరీ సన్మానించడంతో కాంతార 2లో రజనీ కనిపించడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్సై పోయారు.