
హైదరాబాద్, వెలుగు: కే కేశవరావు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియెట్ సీటు ఖాళీ అయిందని బులిటెన్ విడుదల చేసింది. గురువారం కేకే ఎంపీ పదవికి రాజీనామా చేయగా ఒక్క రోజులోనే చైర్మన్ ఆమోదించారు.
బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన కేకే.. కాంగ్రెస్లో చేరారు. దీంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను కలిసి అందజేశారు. నైతిక విలువలకు కట్టబడి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేశానని, తన టర్మ్ ఇంకా రెండేండ్లు ఉందని కేకే రాజీనామా టైమ్ లో తెలిపారు.