
రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ రోడ్లన్నీ వాహనాలతో కళకళలాడుతున్నాయి. సిటీ నుంచి జిల్లాలకు వెళ్లే రూట్లు.. నగరానికి వచ్చే రూట్లు.. ఇలా ఎటు చూసినా చీమల బారులు తీరినట్లుగా వెహికిల్స్ రద్దీతో హైవేలన్నీ నిండిపోయాయి. దీంతో అన్ని దారులలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. హైదరాబాద్ నగరాన్ని దాటి ఓఆర్ఆర్ వెళ్లడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వారం రోజుల పాటు ఉద్యోగాలు, పనులతో బిజీబిజీగా ఉండే హైదరాబాద్ జనాలు.. వీకెండ్ కావడం.. రాఖీ పండుగ రావడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు. తోడబుట్టిన అన్నా తమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు క్యూకట్టారు. మరోవైపు సిటీలో ఉన్న వాళ్లకోసం ఊళ్ల నుంచి హైదరాబాద్ చేరుకునే వారి సంఖ్య కూడా ఎక్కవగా ఉండటం.. నగరంలో పలు ఏరియాలో ఉన్న వారిని కలుసుకునేందుకు భారీగా జనాలు వెళ్తుండటంతో ఆటోలు, బస్ లు, చివరికి మెట్రో స్టేషన్లలో కూడా జనాలు కిక్కిరిసిపోయారు.
ALSO READ : వామ్మో.. సిద్దిపేట దుద్దెడ టోల్ ప్లాజా దగ్గర ఈ ట్రాఫిక్ జామ్ ఏంది !
రాఖీ పండగ వేళ హైద్రాబాద్ టు విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ప్రజలు పండగకు సొంతూళ్లకు వెళ్తుండటంతో RTC బస్సులు, ప్రైవేటు వెహికల్స్ భారీగా బారులుతీరాయి. LBనగర్ నుంచి వనస్థలీపురం, హయతనగర్, అబ్దుల్లాపూర్మెట్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఇటు వరంగల్ హైవేపైన కూడా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల,సిద్ధిపేట వెళ్ళే వాహనాలు ట్రాఫిక్ జామ్ బొల్లారం రోడ్డు పై దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది.
కూకట్ పల్లి, ముంబై జాతీయ రహదారి వెంట.. మియాపూర్ బాచుపల్లి అన్నీ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ రూట్ లో 3కిలోమీటర్ల జర్నీకి 2గంటల పైగా సమయం పడుతోంది. మరోవైపు సికింద్రాబాద్ బొల్లారం రోడ్డుపై దాదాపు 5 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. JBS నుండి ORR వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.