జపాన్ లో రాంచరణ్ కు గ్రాండ్ వెల్ కమ్

జపాన్ లో రాంచరణ్ కు గ్రాండ్ వెల్ కమ్

మెగా పవర్ స్టార్ ‘రాంచరణ్’ను చూసి టోక్యోలోని ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్ధులు హంగామా సృష్టించారు. రాంచరణ్ టీ షర్టులు ధరించి ఘన స్వాగతం పలికారు. రాంచరణ్ దంపతులకు నుదుటిన తిలకం దిద్ది హారతులు ఇచ్చారు. అనంతరం అక్కడున్న విద్యార్ధులకు ‘చెర్రీ’ అభివాదం చేశారు. తమ అభిమాన నటుడిని చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాం చరణ్ దంపతులతో వారు సెల్ఫీలు దిగారు. డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కించారు. రాజమౌళి గత చిత్రాలు ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాలు జపాన్ లో ఆదరణ దక్కించుకున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో సైతం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో శుక్రవారం విడుదలైంది. సినిమా ప్రమోషన్స్ కోసం రాంచరణ్, జూ.ఎన్టీఆర్ దంపతులతో పాటు రాజమౌళిలు జపాన్ కు వెళ్లారు. వారికి జపాన్ వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. కొమరం భీం పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించారు. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మొర్రీస్, సముద్ర ఖనిలు కీలక పాత్రలు పోషించారు.