మెగాస్టార్ బర్త్ డేకి రామ్ చరణ్ మూవీ.. ఫ్యాన్స్కు పండగే

మెగాస్టార్ బర్త్ డేకి రామ్ చరణ్ మూవీ.. ఫ్యాన్స్కు పండగే

ఆగస్టు 22.. మెగా ఫ్యాన్స్ కు ఈ రోజు చాలా స్పెషల్. ఎందుకంటే అది మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టినరోజు కాబట్టి. మెగా ఫ్యాన్స్ ఆ రోజును ఒక పండగలా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరంజీవి ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజు సంధర్బంగా.. సేవా కార్యక్రమాలు, రక్తదానాలు నిర్వహిస్తూ ఉంటారు.

అయితే ఈ ఇయర్ చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా మెగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ రానుంది. ఆ రోజు రామ్ చరణ్(Ram charan) హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ నాయక్(Nayak) సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 4k క్వాలిటీతో, అప్డేటెడ్ సౌండ్ తో నాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ చిత్రాల దర్శకుడు వీవీ వినాయక్(VV Vinayak) డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 2013లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. 

డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal agarwal), అమలా పాల్(Amala paul) హీరోయిన్ గా నటించారు. తమన్(Thaman) సంగీతం అందించిన నాయక్ మూవీ రామ్ చరణ్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచింది. రామ్ చరణ్ ఈ సినిమాలో మొదటిసారి డ్యూయెల్ రోల్ లో కనిపించారు. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నాయక్ సినిమా.. రూ.45 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరి చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా రీ రిలీజ్ అవుతున్న నాయక్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.