చికోటీ ఫాం హౌస్ లో రాంగోపాల్ వర్మ.. ఇద్దరూ దేనిపై చర్చించారు ?

చికోటీ ఫాం హౌస్ లో రాంగోపాల్ వర్మ.. ఇద్దరూ దేనిపై చర్చించారు ?

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ తో వైల్డ్ ఫాం హౌజ్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రత్యక్షమయ్యారు. చికోటీ ప్రవీణ్ తో కలిసి ఫాం హౌజ్ లో ఉన్న జంతువులను పరిశీలించారు. అడవి జంతువుల సేకరణ చాలా ఆకట్టుకుందని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ట్వీట్ చేశారు. IGUANA ను సొంత బిడ్డలా చికోటి ప్రవీణ్ కుమార్ చూసుకుంటున్నాడని రాసుకొచ్చారు. నిప్పుకోడిపై అతనికి చాలా ప్రేమ ఉందని.. అడవి జంతువులపై ఇలా మక్కువ చూపేవాళ్లను ఎవరినీ చూడలేదని  ఆర్జీవీ కామెంట్ చేశాడు. అయితే హఠాత్తుగా చికోటి ప్రవీణ్ కుమార్ తో ఆర్జీవీ ఎందుకు భేటీ అయ్యారో తెలియడం లేదు.

వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా మూవీ వస్తుందా అనే చర్చలు కొనసాగుతున్నాయి. చికోటీపై సినిమా తీయనున్నారా ? భేటీలో ఏం చర్చించారు ? అనేది తెలియాలంటే ఆర్జీవీ ప్రకటన చేయాల్సిందే. ఇటీవలే సీఎం జగన్ తోనూ ఆర్జీవీ భేటీ అయ్యారు. చికోటి ప్రవీణ్ కుమార్ విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన ఇంటిపై ఈడీ అధికారులు దాడితో తెర మీదకు వచ్చారు. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీ చేశారనే ఆరోపణలతో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. చికోటీ ప్రవీణ్ కుమార్ ను విచారించారు.