రాముడు అంటే ప్రేమ, న్యాయం: రాహుల్‌ గాంధీ

రాముడు అంటే ప్రేమ, న్యాయం: రాహుల్‌ గాంధీ
  • అయోధ్య భూమి పూజ సందర్భంగా ట్వీట్‌

న్యూఢిల్లీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌‌ ద్వారా ఆయన పూజ నిర్వహించారు. రాముడు మంచి లక్షణాలు కలిగిన అభివ్యక్తి అని వర్ణించారు. “ రాముడు అంటే ప్రేమ, అసహ్యంగా కనిపించరు. రాముడు అంటే కరుణ, ఇది ఎప్పుడూ క్రూరంగా అనిపించదు, రాముడు అంటే న్యాయం, ఎక్కడా అన్యాయంలో కనిపించడు” అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మొదటి నుంచి తమ పార్టీ సెక్యూరల్‌ అని చెప్తున్న కాంగ్రెస్‌ ఎప్పుడూ హిందూ మతం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. అలాంటిది రామమందిర నిర్మాణం సందర్భంగా తన స్టాండ్‌ మార్చినట్లు కనిపిస్తోంది. ఇన్ని ఏళ్లలో బహుశా గాంధీ కుటుంబం రాముడి గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి అయి ఉంటుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ కూడా రాముడు అందరివాడు అని, ఈ ఆలయ నిర్మాణం అందరిలో ఐకమత్యాన్ని పెంచుతుందని ట్వీట్‌ చేయడం గమనార్హం.