రామ్ స్కంద నుండి కల్ట్ మామ సాంగ్ అప్డేట్.. ఊర్వశి రౌతేలా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

రామ్ స్కంద నుండి కల్ట్ మామ సాంగ్ అప్డేట్.. ఊర్వశి రౌతేలా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ స్కంద(Skanda). డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్,సాంగ్స్ వీపరీతంగా ఆకట్టుకున్నాయి.

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి కల్ట్ మామ ఐటమ్ సాంగ్కు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) స్పెషల్ సాంగ్లో కనిపిస్తోన్న ఈ పోస్టర్ ఆడియన్స్కు మత్తెక్కించేలా ఉంది.ఈ పూర్తీ సాంగ్ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్స్ ఎవ్వరు లేకుండా పోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకు స్పెషల్ సాంగ్స్ అంటే ఊర్వశి రౌతేలా అనేంతగా..తెలుగులో ఆమె వరుస సినిమాల్లో చేస్తుంది. ఈ కల్ట్ మామా సాంగ్కు థమన్ హుషారైన మాస్ బీట్స్ను అందించినట్లు సమాచారం. ఎనర్జిటిక్ రామ్..బ్యూటీ ఉర్వశిలా డ్యాన్స్..స్కందలో హైలెట్ అవుతుందని టాక్. రీసెంట్గా ఊర్వశి రౌతేలా చిరంజీవి వాల్తేరు వీరయ్య, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో, అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. 

ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి కి రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే నిమిషానికి కోటి రూపాయలు అన్నమాట. ఆ రేంజ్‌‌లో రెమ్యూనరేషన్ తీసుకునే మరో నటి లేదని సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఈ రెమ్యూనరేషన్ మీద వస్తోన్న వార్తలు నిజమో కాదో ఊర్వశి స్పందిస్తేనే తెలుస్తుంది.

రామ్కి జోడీగా శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో సయీ మంజ్రేకర్ కీలక పాత్ర పోషిస్తుంది. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.ఈ మూవీ సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.