16 రోజులకు రామ డెడ్బాడీ లభ్యం... నాగోల్ బ్రిడ్జి వద్ద గుర్తింపు

16 రోజులకు రామ డెడ్బాడీ లభ్యం... నాగోల్ బ్రిడ్జి వద్ద గుర్తింపు

మెహిదీపట్నం, వెలుగు: ఇటీవల అసిఫ్​నగర్ పరిధిలోని అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన రామ (25) డెడ్​బాడీ ఎట్టకేలకు లభ్యమైంది. శుక్రవారం అర్ధరాత్రి చైతన్యపురి పీఎస్​పరిధిలోని నాగోల్ బ్రిడ్జి సమీపంలో ఓ డెడ్​బాడీ లభ్యమైంది. శనివారం ఉదయం రామ కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకొని.. డెడ్​బాడీపై ఉన్న టాటూ, దుస్తుల ఆధారంగా రామగా గుర్తించారు. 

ఈ నెల 14 భారీ వర్షాలకు  అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుళ్లు అర్జున్, రామ గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ నెల 18న నల్గొండ జిల్లా వలిగొండలో అర్జున్​డెడ్​బాడీ లభించగా, తాజాగా రామ డెడ్​బాడీ లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం రామ డెడ్​బాడీని కుటుంబసభ్యులు అప్పగించినట్లు సీఐ పురుషోత్తం తెలిపారు.  

వాగులో గల్లంతైన మరొకరి డెడ్​బాడీ లభ్యం

షాద్ నగర్: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండలం తంగేళ్లపల్లి, విశ్వనాథాపూర్ గ్రామాల మధ్య వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి శవం శనివారం దొరికింది. మంచిర్యాల గ్రామానికి చెందిన దస్తగిరి లింగం(50) శుక్రవారం వాగులో గల్లంతయ్యాడు. కొద్ది దూరంలోనే చెట్ల పొదల్లో శనివారం ఆయన మృతదేహం దొరికింది. 

లింగం మృతదేహంలో షాద్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బంధువులు రాస్తారోకో చేశారు. పోలీసులకు వారిని చెదరగొట్టే సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. వారికి మద్దతుగా వచ్చిన బీజేపీ కార్యకర్త ప్రశాంత్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి దూసుకెళ్లడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.