హైదరాబాద్, వెలుగు: కేటీఆర్, హరీశ్ రావుకు దమ్ము, ధైర్యం ఉంటే వారి ఆస్తులపై విచారణకు సిద్ధం కావాలని విప్ రాంచంద్రు నాయక్ సవాల్ విసిరారు. శనివారం సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారి కుటుంబ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై మాట్లాడుతున్నారని ఆరోపించారు.
మెడికవర్ హస్పిటల్ తో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. హైదరాబాద్ లో తనకు ఇళ్లే లేదని చెప్పిన కేటీఆర్‌కు మూడు స్టార్ హోటళ్లు ఉన్నాయని మాత్రం చెప్తున్నాడని, ఇలా అబద్ధాలు చెప్పేందుకు సిగ్గు ఉండాలని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగినట్లు..తెలంగాణ ప్రజల ఆస్తులు ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు.
