హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం ప్రారంభించారు. రెండో విడతలో భాగంగా రామంతాపూర్ పెద్ద చెరువు పనులు చేస్తున్నారు. దీని ఎఫ్టీఎల్ విస్తీర్ణం 30 ఎకరాలు కాగా, 16 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. ఇందులో 12 ఎకరాల్లో శాశ్వత కట్టడాలు వెలిశాయి. మరో 4 ఎకరాల మేర తాత్కాలిక షెడ్లు, గుడిసెలు ఉన్నాయి. శాశ్వత కట్టడాల జోలికి వెళ్లకుండా 18 ఎకరాలకు పైగా భూమిని హైడ్రా కాపాడి, అభివృద్ధి పనులు చేస్తోంది.
