ఉప్పల్, వెలుగు: రామంతాపూర్ ఇందిరానగర్‌లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం భారీ ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది. ఈ సంఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఈ ఆలయంలో సుమారు 23 ఏండ్ల క్రితం ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు.

