నేటినుంచి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

నేటినుంచి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
  • రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు 7 వేల మందితో బందోబస్తు
  • సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

శంషాబాద్, వెలుగు: నేటి నుంచి 14వ తేదీ వరకు శంషాబాద్ మండల పరిధి ముచ్చింతల్​లోని చినజీయర్ ఆశ్రమం శ్రీరామనగరంలో జరగనున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు 7 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. మంగళవారం శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చినజీయర్ ఆశ్రమంలో పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, చినజీయర్ స్వామి పాల్గొని పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సీపీ  స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది ఎవరూ పర్మిషన్ లేకుండా యజ్ఞశాల ఆవరణలోకి ప్రవేశించవద్దన్నారు. మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దన్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ, 7న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 13న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర వీఐపీలు పాల్గొంటారని చెప్పారు.