- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌ను కఠినంగా అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఇందుకోసం ప్రతీ మున్సిపాలిటీలో ఒక జియోటెక్నికల్వింగ్ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ లో శుక్రవారం నిర్వహించిన ఇంపార్టెన్స్ ఆఫ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ సెమినార్‌లో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా స్కై స్క్రాపర్లే కనిపిస్తున్నాయని, ఒకప్పుడు రెండేండ్లు పట్టిన నిర్మాణం.. ఇప్పుడు 6 నెలల్లోనే పూర్తవుతోందని చెప్పారు. టెక్నాలజీ పెరిగిందని, పునాది బలంగా ఉందా, నేల సామర్థ్యాన్ని చెక్ చేసుకోవాలన్నారు. అలా చేయకపోతే ఎంతటి భారీ నిర్మాణమైనా కూలి పోతుందన్నారు. ప్రతీ ఇంజినీర్, నిర్మాణ సంస్థ భూ పరిశీలనను ప్రాథమిక సూత్రంగా పాటించాలని సూచించారు.
