ఆ స్థలం సంగం రామాలయానిదే: మఠాధిపతి రాహుల్ దాస్ బాబా

ఆ స్థలం సంగం రామాలయానిదే: మఠాధిపతి రాహుల్ దాస్ బాబా

మెహిదీపట్నం, వెలుగు: లంగర్​హౌస్​లోని రామ్​లీలా మైదానం సంగం రామాలయానికి చెందినదేనని ఆలయ మఠాధిపతి రాహుల్ దాస్ బాబా తెలిపారు. రామ్​లీలా మైదానాన్ని కొందరు కబ్జా చేస్తున్నట్లు, టూరిజం శాఖ అధికారులను అడ్డుకున్నట్లు సీపీఐ నేత వెంకట్ రెడ్డి సీఎం రేవంత్​రెడ్డికి రాసిన లేఖలో నిజం లేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

వందల సంవత్సరాలుగా రామ్​లీలా మైదానంలో గుడికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. టూరిజం శాఖ అధికారులు ఇటీవల ఫెన్సింగ్ చేసేందుకు వస్తే స్థానిక అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారన్నారు. టూరిజం శాఖకు చెందిన భూమిలో బాపు స్మారక భవనం ఉందని పేర్కొన్నారు. 

సమావేశంలో అఖిలపక్ష నాయకులు బాల ప్రసాద్ తివారి, రవీందర్ రెడ్డి, వినేశ్ సింగ్, ఇంద్రసేనారెడ్డి, లింగారెడ్డి, మాతాంగి రమేష్, దాసు, జెన్న సుధాకర్, కమలాకర్, పాండు కుమార్, నాగేంద్ర ప్రకాష్ రెడ్డి, ఆమంచి శ్రీకాంత్ తో పాటు స్థానిక నాయకులు ఉన్నారు.