హైడ్రాకు అతిపెద్ద అచీవ్ మెంట్.. బతుకమ్మ కుంట ప్రారంభంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రాకు అతిపెద్ద అచీవ్ మెంట్.. బతుకమ్మ కుంట ప్రారంభంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్

బతుకమ్మ కుంట ప్రారంభం హైడ్రాకు అతిపెద్ద అచీవ్ మెంట్ అని అన్నారు కమిషనర్ రంగనాథ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణం పూర్తి చేసినట్లు అన్నారు. ఆరు నెలల క్రితం ఇక్కడ డంపింగ్ యార్డు ఉండేదని.. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించినట్లు చెప్పారు. 

ఆదివారం (సెప్టెంబర్ 28) బతుకమ్మ కుంట ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన..  ఆరు నెలల క్రితం తవ్వితే ఇక్కడ నీళ్లు వచ్చినట్లు చెప్పారు. 7కోట్ల40 లక్షల రూపాయలతో బతుకమ్మ కుంట సుందరీకరణ చేపట్టినట్లు చెప్పారు. 5 ఎకరాల 15 గుంటల స్థలంలో బతుకమ్మ కుంట పేరుతో వర్టికల్​ గార్డెన్​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

బతుకమ్మ కుంట పునరుద్ధరణతో ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిందని అన్నారు. హైడ్రా ఇప్పటి వరకు 50 వేల ఎకరాల భూములను కాపాడిందని చెప్పిన రంగనాథ్.. హైడ్రా పని చేసేది భవిష్యత్ తరాల కోసమేనని అన్నారు.