V6 News

‘ఆదిపురుష్’ సినిమాను ప్రతి కుటుంబం చూడాలి

‘ఆదిపురుష్’ సినిమాను ప్రతి కుటుంబం చూడాలి
  • చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్

చేవెళ్ల, వెలుగు: ‘ఆది పురుష్’ మంచిగా ఆడాలని, ప్రతి కుటుంబం ఈ సినిమాను చూడాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామాయణం ఆధారంగా సినిమా తీసిన డైరెక్టర్​ఓంరౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాముడు, సీత పాత్రలు పోషించిన ప్రభాస్, కృతిసనన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, చిత్ర యూనిట్ సభ్యులందరికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థించారు.

రాముడి గొప్పదనం తెలిపేలా చేసిన ప్రయత్నాన్ని అభినందించాలన్నారు. సినిమా అద్భుతంగా రావాలి. ప్రేక్షకుల మదిలో రాములవారి గొప్పతనం నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఇటీవల తిరుమల కొండపై హీరోయిన్​కృతిసనన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డైరెక్టర్​ముద్దుపెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశానని, కొండపై అలాంటివి చేయకూడదనే ఉద్దేశంతోనే తాను  స్పందించానన్నారు.