నవీపేట్, వెలుగు: ఇరువై రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గోదావరి నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామానికి చెందిన గట్టుపల్లి రంజిత్ (36) డిచ్ పల్లి ఐసీడీస్ ప్రాజెక్టులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈనెల 15న బింగల్ లో బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.
వెతికినా ఆచూకీ దొకకపోవడంతో కుటుంబసభ్యులు 17న ముథోల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం బాసర గోదావరి నదిలో గుర్తుతెలియని శవం ఉందని నవీపేట్ పోలీసులకు సమాచారం అందగా వెళ్లి పరిశీలించారు. అక్కడే ఉన్న బైక్ ఆధారంగా డెడ్‌బాడీ రంజిత్దిగా గుర్తించారు. మృతుడి తల్లి భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. రంజిత్‌కు వచ్చే నెల 8న పెళ్లి నిశ్చయమైంది. రంజిత్ తండ్రి గతంలోనే చనిపోయాడని, ఇప్పుడు కొడుకు మృతిచెందడంతో తల్లి భూలక్ష్మి ఒంటరైందని గ్రామస్తులు తెలిపారు.

