
50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ VRO. ముత్యం రెడ్డి అనే రైతు తన 1.20 ఎకరాల భూమికి మ్యుటేషన్ చేయించడానికి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలం తుర్కయాంజల్ వీఆర్వో గుర్రం శంకర్ ను కలిశారు. అయితే తనకు 70వేలు ఇస్తేనే ముట్యేషన్ చేస్తానని చెప్పడంతో.. ముత్యం రెడ్డి ACB అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ముత్యం రెడ్డిని పట్టుకోవడానికి ప్లాన్ వేసిన ఏసీబీ అధికారులు… VRO కు ముందుగా 50వేలు ఇస్తానని ముత్యం రెడ్డితో చెప్పించారు.
అనుకున్నట్టుగానే… గురువారం VRO శంకర్ కు ముత్యం రెడ్డి 50 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ అండ్ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో పాటు వీఆర్వో ఆఫీస్ లో కూడా సోదాలు నిర్వహించారు. శంకర్ ను కోర్టుకు తరలించనున్నట్లు ACB అధికారులు చెప్పారు. ఎవరైనా అధికారి లంచం కోసం వేధిస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయాలని( 9440446140 ) డీఎస్పీ తెలిపారు.