ముందో లారీ.. వెనుకో లారీ ఢీకొనడంతో నుజ్జనుజ్జయిన కారు..రంగారెడ్డి జిల్లాలో ఘటన

ముందో లారీ.. వెనుకో లారీ ఢీకొనడంతో నుజ్జనుజ్జయిన కారు..రంగారెడ్డి జిల్లాలో ఘటన
  •      ఐదుగురికి తీవ్ర గాయాలు

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలుకు చెందిన షేక్ తల్హా అహ్మద్ తన స్నేహితులు అమన్ భాషా, రజాక్, సమీర్, ఆసిల్​తో కలిసి సోమవారం కారులో హైదరాబాద్​కు బయలుదేరారు. షాద్​నగర్​పరిధిలోని తిమ్మాపూర్ ఐవోసీఎల్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే, వీరి కారును వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది.

దీంతో కారు ముందున్న మరో లారీని ఢీకొనంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికులు అతికష్టమ్మీద బయటకు తీశారు. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.