
హైదరాబాద్, వెలుగు : ఢిల్లీ లిక్కర్‌స్కామ్ కేసులో కవిత జైలుకెళ్లినట్టే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, డ్రగ్స్ దందా, భూకబ్జా కేసుల్లో కేటీఆర్, కాళేశ్వరం అవినీతి కేసులో హరీశ్‌రావు జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి అన్నారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం చేశారని అడుగుతున్న కేటీఆర్.. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. షాడో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్.. గత ఎన్నికల్లో గెలిచి సీఎం అవుదామనుకున్నారని.. కానీ, ప్రజలు ఓడించడంతో మతిభ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.