
సికింద్రాబాద్: ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని తట్టుకోలేక మేడ్చల్ మండలం డబిల్ పూర్ గ్రామానికి చెందిన షేక్ బాబా తన ఇంట్లోనే గుళికల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నగరంలోని రష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం షేక్ బాబా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. షేక్ బాబా రాణిగంజ్ డిపో 1లో మెకానిక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. షేక్ బాబాకు భార్య సబియా, షేక్ రజ్వాన్, షేక్ రహీమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం షేక్ బాబా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.