హైదరాబాద్: ఏఐటీఏ–టీఎస్‌టీఏ నేషనల్ సిరీస్ అండర్–12 ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ టైటిల్‌ను చౌకి చేతనశ్రీ గెలుచుకుంది. ఫైనల్లో చేతనశ్రీ 6–4, 6–1తో అన్వీ హోండాపన్వర్‌పై గెలిచింది. లీగ్ దశ నుంచి అద్భుతంగా ఆడిన చేతనశ్రీ.. ఫైనల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించింది. బలమైన సర్వీస్‌లు, క్రాస్ కోర్టు ర్యాలీలతో ఆకట్టుకుంది.
