రన్నింగ్ బస్ లో పడుకున్న మహిళపై అత్యాచారం

రన్నింగ్ బస్ లో పడుకున్న మహిళపై అత్యాచారం

నిర్భయ ఘటన తరహాలో లక్నోలో కూడా ఒక మహిళపై రన్నింగ్ బస్ లో అత్యాచారం జరిగింది. లక్నోకు చెందిన 30 ఏళ్ల మహిళ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఒక ప్రైవేట్ బస్ లో ఢిల్లీకి బయలుదేరింది. అయితే బస్సు శనివారం ఉదయం యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఢిల్లీకి చేరుకుంటుండగా.. ఆ మహిళ బస్సులో తనపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

‘నేను బస్సులో స్లీపర్ సీటులో పడుకున్నాను. బస్సులో మరో 45 మంది కూడా పడుకున్నారు. బస్సు క్లీనర్ రవి.. ప్రయాణికులందరూ పడుకోవడం గమనించి నా దగ్గరకు వచ్చాడు. నా బట్టలు చింపేసి.. నా పై బలవంతంగా అత్యాచారం చేశాడు’ అని సదరు మహిళ పోలీసులకు తెలిపింది.

‘శనివారం ఉదయం 5:30 నిమిషాలకు బస్సు మధురలోని మాంట్ టోల్ ప్లాజాకు చేరుకోగానే.. ఓ మహిళ 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి.. బస్సు క్లీనర్ రవి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది’అని పోలీసులు తెలిపారు. స్పందించిన పోలీసులు వెంటనే మైల్ స్టోన్ 65 దగ్గర బస్సును ఛేజ్ చేసి ఆపి ఆ మహిళను మరియు నిందితుడు రవిని బస్సులో నుంచి దింపేసి.. బస్సును ఢిల్లీకి పంపించారు. ఆ తర్వాత మహిళకు వైద్య పరీక్షలు చేయించి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఆమె ఇంటి వద్ద దింపారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకొని.. ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు.

For More News..

లక్షల నిధులు.. మురుగు పాలు

తెలంగాణలో మరో 2,924 కరోనా కేసులు నమోదు

నాకు ఆ పాత్ర చేయాలని ఎప్పటినుంచో ఉంది