బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్.. బైక్ టాక్సీలపై నిషేధం ఎత్తేసిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్.. బైక్ టాక్సీలపై నిషేధం ఎత్తేసిన కర్ణాటక హైకోర్టు

కర్ణాటకలో బైక్ టాక్సీలపై కొనసాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ప్రతిరోజూ నరకయాతన అనుభవించే బెంగళూరు ప్రజలకు ఇది తీపి కబురని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రపంచంలో రెండో అత్యంత రద్దీ నగరంగా ఉన్న బెంగళూరు ప్రజలకు ఇది నిజంగా కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఇచ్చిన సంచలన తీర్పుతో రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయే ఐటీ నిపుణులు, సామాన్యులకు తక్కువ ధరలో వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం మళ్లీ లభించనుంది.

గతంలో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన నిషేధాజ్ఞలను హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా రద్దు చేసింది. మోటారు వాహనాల చట్టం కింద నిర్దిష్ట నిబంధనలు లేవనే కారణంతో గత ఏప్రిల్ 2న సింగిల్ జడ్జి బెంచ్ బైక్ టాక్సీలను నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. దీనిపై ఓలా, ఉబెర్, రాపిడో వంటి అగ్రిగేటర్లు అప్పీల్ చేయగా.. కోర్టు సానుకూలంగా స్పందించింది. తాజా తీర్పుతో ఈ సంస్థలు తమ యాప్‌లలో బైక్ టాక్సీ సర్వీసులను తిరిగి స్టార్ట్ చేసేందుకు డోర్లు తెరుచుకున్నాయి.

►ALSO READ | US vs Adani: మన అదానీని టార్గెట్ చేసిన అమెరికా.. భారీగా పడిపోయిన షేర్లు..

2025 జూన్ నెలలో హైకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందిస్తూ.. కోర్టు గడువు ముగియడంతో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలు లేకపోవడం, ఆటో డ్రైవర్ల సంఘాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత ఈ నిషేధానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కోర్టు నిషేధాన్ని ఎత్తివేసినా, ప్రభుత్వం విధించే కొన్ని షరతులకు లోబడి బైక్ టాక్సీ సేవలు కొనసాగాల్సి ఉంటుందని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటైన బెంగళూరులో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఒక పెద్ద సవాలుగా మారింది. ఆటోలు, క్యాబ్‌లు ఎక్కువ రేట్లు వసూలు చేయడం లేదా రైడ్ క్యాన్సిల్ చేయడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రయాణికులకు బైక్ టాక్సీలు ఎప్పుడూ చౌకైన ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. తాజా తీర్పుతో ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ వేగంగా వెళ్లడమే కాకుండా.. వేలాది మంది బైక్ రైడర్లకు మళ్లీ ఉపాధి లభించనుంది. ప్రభుత్వం త్వరలోనే ఈ సేవలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.