మలక్పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ లో అరుదైన సర్జరీ..ప్యాంక్రియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కాపాడుతూ ట్యూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలగింపు

మలక్పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ లో అరుదైన సర్జరీ..ప్యాంక్రియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కాపాడుతూ ట్యూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలగింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఇబ్రహీంపట్నానికి చెందిన 33 ఏండ్ల మహిళ ప్యాంక్రియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కాపాడుతూ ట్యూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలగించి మలక్​పేట కేర్​దవాఖాన డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ప్యాంక్రియాస్ చాలా ముఖ్యమైన అవయవం. ఇది ఇన్సులిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేసి రక్తంలో షుగర్​లెవెల్స్​నియంత్రిస్తుంది. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇబ్రహీంపట్నానికి చెందిన సుష్మితకు ప్యాంక్రియాస్ ట్యూమర్​ఏర్పడింది. దీన్ని తీసేస్తే ఆమె జీవితాంతం ఇన్సులిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆధారపడాల్సి వస్తుంది. కానీ, అలా జరగకుండా ఏం చేయాలా అని మలక్​పేట కేర్​డాక్టర్లు ఆలోచించారు. 

రోగికి ప్యాంక్రియాస్ చాలా మృదువుగా ఉండటం, ప్యాంక్రియాటిక్ డక్ట్ పరిమాణం 2 మిల్లీమీటర్లు మాత్రమే ఉండడంతో సర్జరీ సవాలుగా మారింది. దీంతో సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ అండ్​సర్జికల్ గాస్ట్రోఎంట్రాలజీ అండ్​ రోబోటిక్ సర్జరీ విభాగం హెడ్​డాక్టర్ భూపతి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్యాంక్రియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలగించకుండా రెండు క్లిష్టమైన సర్జరీలు చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.