మళ్ళీ ప్రేమలో పడ్డ రాశి.. ఫుల్ బిజీగా ఉందట!

మళ్ళీ ప్రేమలో పడ్డ రాశి.. ఫుల్ బిజీగా ఉందట!

బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా(Rashi khanna) మళ్లీ ప్రేమలో పడింది. తాజాగా తన లవ్​ జర్నీ గురించి వివరించింది. గతంలో ఓ వ్యక్తితో తాను రిలేషన్​లో ఉన్నానని అయితే అతని టాక్సిక్​ మెంటాలిటీ కారణంగా డిప్రెషన్​లోకి వెళ్లినట్టు పేర్కొంది. ఆ ప్రభావం తన సినిమాలపై కూడా పడిందని తెలిపింది. కెరీర్​ పీక్స్​ టైంలో ఉండగా రాశి లవ్​ లైఫ్​ కారణంగా ఆమె సినిమాలు తగ్గించేసింది. 

డిప్రెషన్​కు తోడు థైరాయిడ్​ కారణంగా అధిక బరువు తనను చాలా డిస్టర్బ్​ చేసినట్టు చెప్పింది. ఇప్పుడు మరోసారి రాశి సినిమాలకు దూరంగా ఉంటోంది. అందుకు కారణం తన బాయ్​ఫ్రెండేనని తెలుస్తోంది. అతనితో ప్రేమలో పడటం వల్ల తాను బరువు తగ్గానని చెప్పింది. ప్రస్తుతం అతడి కంపెనీని ఎంజాయ్​ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే, ఆ వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు. తమిళం, హిందీలో చేస్తున్న సినిమాలు తప్ప కొత్త ప్రాజెక్ట్స్​ ఏమీ రాశీ ఒకే చేయడం లేదట.