V6 News

Rashmika : రక్తసిక్తంగా రష్మిక.. 'మైసా' సెట్స్ నుండి షాకింగ్ లుక్ వైరల్!

Rashmika : రక్తసిక్తంగా రష్మిక.. 'మైసా' సెట్స్ నుండి షాకింగ్ లుక్ వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు.కమర్షియల్ చిత్రాలకే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. తన కెరీర్ ను కొత్త పుంతలు తొక్కిస్తోంది. లేటెస్ట్ గా రష్మిక నటిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అందిస్తూ ఒక ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రష్మిక షేర్ చేసింది.

రక్తసిక్తంగా రష్మిక !

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ ఫోటోలో రష్మిక కుడి చేయి రక్తంతో నిండి ఉంది, చేతిలో పదునైన కత్తిని పట్టుకుని కనిపిస్తోంది. ఆమె చేతిపై ఉన్న విలక్షణమైన టాటూ కూడా ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి."మైసా సెట్స్‌లో పరిస్థితులు చాలా రక్తసిక్తంగా మారుతున్నాయి!" అంటూ రష్మిక ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.

యుద్ధానికి సిద్ధమైన ఆయుధం!

దర్శకుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రష్మిక మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఫోటోను ఆయన షేర్ చేస్తూ.. "గాయాలతో రాసిన యుద్ధం.. ఆమె ఒక ఆయుధం" అంటూ చేసిన కామెంట్స్ సినిమా థీమ్‌ను స్పష్టం చేస్తున్నాయి. గిరిజన నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక మునుపెన్నడూ చూడని ఉగ్రరూపంలో కనిపించనుంది.

ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్ నేతృత్వంలో హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయి జేక్స్ బిజోయ్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.  శ్రేయాస్ పి కృష్ణ తన కెమెరా పనితనంతో విజువల్స్ పండించనున్నారు. గతంలో విడుదలైన టీజర్ వాయిస్ ఓవర్.. "చావు చావును ఎదుర్కొంది.. నా బిడ్డను చంపలేకపోయింది" అంటూ సాగే డైలాగులు రష్మిక క్యారెక్టర్‌లోని పవర్‌ను ఎలివేట్ చేస్తున్నాయి.

ALSO READ : పోలింగ్ రోజుల్లో.. విధుల్లో ఉండి.. 

రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్టులు

కేవలం 'మైసా' మాత్రమే కాకుండా, రష్మిక డైరీ ప్రస్తుతం బిజీగా ఉంది.షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి 'కాక్ టెయిల్ 2'లో సందడి చేయనుంది. రణబలి విజయ్ దేవరకొండతో జతకట్టి మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది. పుష్ప 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి శ్రీవల్లిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి 'మైసా' చిత్రంతో రష్మిక తనలోని మాస్ యాక్షన్ యాంగిల్‌ను ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమైపోయింది.