V6 News

ఇది బెంగాల్... నువ్వు సింగం అయితే... నేను పుష్ప..! ఐపీఎస్ ఆఫీసర్ పై టీఎంసీ అభ్యర్థి ఫైర్..

ఇది బెంగాల్... నువ్వు సింగం అయితే... నేను పుష్ప..! ఐపీఎస్ ఆఫీసర్ పై టీఎంసీ అభ్యర్థి ఫైర్..

పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నియమించిన ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్. బీజేపీ నియమించిన పోలీసులు ఓటర్లను బెదిరించాలని చూస్తే సహించబోమని అన్నారు. ఇది బెంగాల్.. నువ్వ యూపీలో సింగం అయితే... నేను పుష్ప అంటూ ఫైర్ అయ్యారు జహంగీర్ ఖాన్. మంగళవారం ( ఏప్రిల్ 28 ) సౌత్ 24 పరాగణాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

అజయ్ పాల్ శర్మ తన పరిధిని అతిక్రమిస్తున్నారంటూ మండిపడ్డారు టీఎంసీ సీనియర్ నాయకులు, మంత్రులు. 2011 బ్యాచ్ కి చెందిన అజయ్ కి వ్యతిరేకంగా టీఎంసీ శ్రేణులు నిరసనలు తెలిపారు. స్థానిక టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నివాసం, పోలింగ్ కేంద్రం దగ్గర 'జై బంగ్లా' అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.

ఖాన్ మనుషులు ప్రజల నుంచి ఓటరు గుర్తింపు కార్డులు సేకరించి, వారిని బెదిరిస్తున్నారని..అక్కడికి అజయ్ శర్మ సోదాలు వెళితే టీఎంసీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు అధికారులు.బీజేపీ నియమించిన పోలీసులు ఓటర్లను బెదిరించడాన్ని తాను సహించబోనని" చెప్పడానికి టీఎంసీ అభ్యర్థి ఖాన్ తెలుగు యాక్షన్ చిత్రం 'పుష్ప', బాలీవుడ్ పోలీస్ చిత్రం 'సింగం'లను ప్రస్తావించారు.

"ఇది బెంగాల్; అతను 'సింగం' అయితే, నేను 'పుష్ప'. ఉత్తరప్రదేశ్ నుండి బీజేపీ నియమించిన పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని...బలవంతం చేస్తే సహించబోమని అన్నారు ఖాన్. జహంగీర్ ఖాన్ వర్సెస్ అధికారుల ఎపిసోడ్ తో పోలింగ్ కు ముందే బెంగాల్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.