సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం కోసం హీరోల మధ్యే కాదు.. హీరోయిన్ల మధ్య కూడా పోటీ మామూలుగా లేదు. బాక్సాఫీస్ రికార్డులు, గ్లామర్ షో మాత్రమే కాదు, రెమ్యునరేషన్ విషయంలో కూడా ముద్దుగుమ్మలు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే క్వీన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార రాజ్యమేలింది.
ఒక్కో సినిమాకు రూ. 9 కోట్ల నుండి రూ. 12 కోట్ల వరకు వసూలు చేస్తూ టాప్‌లో నిలిచింది నయన్. కానీ, 2026 నాటికి సీన్ పూర్తిగా మారిపోయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. నయనతార రికార్డును తిరగరాసి సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నంబర్ వన్ హీరోయిన్‌గా అవతరించింది!
రూ. 15 కోట్ల క్లబ్‌లో రష్మిక..
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. రష్మిక మందన్న తన రాబోయే బాలీవుడ్ చిత్రం ‘కాక్ టెయిల్ 2’ (Cocktail 2) కోసం ఏకంగా రూ. 15 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుందట. ఇదే నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సౌత్ హీరోయిన్ ఈ స్థాయి రెమ్యునరేషన్ అందుకోవడం ఒక సంచలనమనే చెప్పాలి. రష్మిక మార్కెట్ వాల్యూ ఈ రేంజ్‌లో పెరగడానికి కారణం ఆమె ఖాతాలో ఉన్న బ్లాక్‌బస్టర్ హిట్టులే. రణబీర్ కపూర్‌తో నటించిన 'యానిమల్', అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప 2', అలాగే బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఛావా' చిత్రాల భారీ విజయాలతో రష్మిక ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం సినిమాలే కాదు, టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్స్‌తో నార్త్ టూ సౌత్ ఇండియాను షేక్ చేస్తోంది.
'పుష్ప' కంటే ముందు.. ఆ తర్వాత..!
ఇక్కడ క్రేజీ విషయం ఏంటంటే.. 'పుష్ప: ది రైజ్ (పార్ట్ 1) సినిమా కోసం రష్మిక తీసుకున్న పారితోషికం కేవలం రూ. 2 కోట్లు మాత్రమే. కానీ, 'శ్రీవల్లి'గా ఆమె తెచ్చుకున్న క్రేజ్, ఆ తర్వాత బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ ఆమె కెరీర్ గ్రాఫ్‌ను స్కై-రాకెట్ రేంజ్‌లో పెంచేశాయి. కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే రూ. 2 కోట్ల నుండి రూ. 15 కోట్లకు చేరడం అంటే రష్మిక క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు అని సినీ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
సౌత్ టాప్ హీరోయిన్ల రెమ్యునరేషన్
ప్రస్తుతం ఇండస్ట్రీ టాక్ ప్రకారం మిగతా స్టార్ హీరోయిన్ల పారితోషికాలు జూన్ 2026 నాటికి బారీగానే ఉన్నాయి. చైన్నై బ్యూటీ త్రిష ప్రస్తుతం రూ. 10 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుంది. దళపతి విజయ్ 'గోట్' , చిరంజీవి 'విశ్వంభర' చిత్రాల హవా తర్వాత ఈ రేంజ్ మెయింటైన్ చేస్తోంది.
►ALSO READ |మేమేం గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.. నాగబాబు ట్వీట్‌పై విరుచుకుపడ్డ ప్రకాశ్ రాజ్!
సమంత రూత్ ప్రభు రూ. 7 నుండి 10 కోట్లు పారితోషికం వసూళ్లు చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీ ఉంది. త్వరలోనే 'మా ఇంటి బంగారం' మూవీ రిలీజ్ కానుంది తండేల్ , రామాయణం చిత్రాలతో ఫుల్ డిమాండ్ లోకి వచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రూ 6 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక అనుష్క శెట్టి రూ. 5 నుండి రూ. 6 కోట్లు వసూళ్లు చేస్తుందని సమాచారం.
ఈ లెక్కలన్నీ చూస్తుంటే.. ఒకప్పుడు బాలీవుడ్ భామలకే పరిమితమైన భారీ రెమ్యునరేషన్లను ఇప్పుడు సౌత్ బ్యూటీలు, అందునా రష్మిక మందన్న సొంతం చేసుకోవడం గర్వించదగ్గ విషయమే. రష్మిక సృష్టించిన ఈ కొత్త బెంచ్‌మార్క్, రాబోయే రోజుల్లో హీరోయిన్ల స్టార్డమ్‌ను మరింత నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
