సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది రష్మిక మందన్నా(Rashmika Mandanna).ఆమె చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకుపైగా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో తను ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 5న) రష్మిక బర్త్డే స్పెషల్గా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్లో రష్మిక ట్రెడిషనల్ లుక్‌లో అందంగా కనిపిస్తోంది.2000ల కాలం నాటి మెస్మరైజింగ్ లుక్తో తలపిస్తోంది.తన చేతికి ఓల్డ్ మోడల్ వాచ్ పెట్టుకుని కాలేజీ అమ్మాయిగా కళ్లు చిరునవ్వులు చిందిస్తూ పెదాలకే అందాన్ని తీసుకొచ్చింది.
అంతేకాదు ఆమె మాట్లాడటానికి కేవలం ఆ కళ్ళు చూస్తే చాలేమో అనే అంతలా తన లుక్ ఎన్నో భావాలను తెలుపుతుంది."ది గర్ల్‌ఫ్రెండ్‌గా అందరూ చూసే వరకు వేచి ఉండలేము..హ్యాపీ బర్త్ డే రష్మిక"అంటూ మేకర్స్ ఇచ్చిన పొయెటిక్ క్యాప్షన్ అదిరిపోయింది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rahulaaaaaa.. 🥺🥺❤️ thankyou so so sooooo muchhhhh! 🥺❤️ I can’t wait to start showing the world the lil snippets of the girlfriend ❤️🥺 https://t.co/pFCW4weQTz
— Rashmika Mandanna (@iamRashmika) April 5, 2024
అందాల రాక్షసి, చిలసౌ వంటి మూవీస్తో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే స్టోరీ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ రాహుల్ రవీంద్రన్ కావడం విశేషం.ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మికకు 24వ చిత్రం కాగా..గీతా ఆర్ట్స్51వ చిత్రంగా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై విద్యా కొప్పినీడి,ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు రష్మిక ‘పుష్ప2’ చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉంది. ఇందులో పుష్పరాజ్ (అల్లు అర్జున్) భార్యగా శ్రీవల్లి పాత్రలో ఆమె కనిపించనుంది.ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.అలాగే ‘రెయిన్ బో’ చిత్రంలో లీడ్‌గా నటిస్తోంది. ఇక హిందీలో ‘ఛవా’ చిత్రంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంది.