టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ(Ananya Nagalla) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ హారర్ ఎంటర్టైనర్ తంత్ర(Thantra). దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి(Srinivas Gopishetty) తెరకెక్కించిన ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవి చైతన్య సంయుక్తంగా నిర్మించారు. మరో హీరోయిన్ సలోని కీ రోల్ చేసిన ఈ సినిమాలో మీసాల లక్షణ్, టెంపర్ వంశీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. హారర్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మర్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ, కథనం విషయంలో మంచి టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయిది. అందుకే విడుదలై నెలరోజులు కూడా కాకుండానే ఓటీటీకి తీసుకొచ్చారు మేకర్స్. తంత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.
ఇక తంత్ర సినిమా కథ విషయానికి వస్తే.. పుట్టుకతోనే తల్లి(సలోని)ని కోల్పోయిన రేఖ(అనన్య నాగళ్ళ) నాన్నమ్మ దగ్గర పెరుగుతుంది. రేఖ అదే ఊరికి చెందిన ధనుష్ తో ప్రేమలో పడుతుంది. కానీ, ధనుష్ వేశ్య కొడుకు కావడంతో సమస్యలు తలెత్తుతాయి. ఇక మరోవైపు రేఖకు క్షుద్ర పూజలు, దెయ్యాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను దాటి రేఖ, ధనుష్ ఒక్కటయ్యారా అనేది తంత్ర కథ.