అది ఖచ్చితంగా తప్పే.. డీప్ ఫేక్ నిందితుడి అరెస్ట్పై రష్మిక రియాక్షన్

అది ఖచ్చితంగా తప్పే.. డీప్ ఫేక్ నిందితుడి అరెస్ట్పై రష్మిక రియాక్షన్

ఇటీవల సౌత్ స్టార్ రష్మిక మందన్న(Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో(Deep fake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో దేశవ్యాప్త సంచలంగా మారింది. ఆ విషయంపై స్పందించిన రష్మిక.. ఈ ఇష్యూపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయంలో టాప్ స్టార్స్ సైతం రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. డీప్ ఫేక్ వీడియో చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీస్ ఈ కేసును ప్రత్యేకంగా తీసుకొని విచారణ మొదలుపెట్టారు.

అందులో భాగంగా.. ముందు ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిన్న(జనవరి20) ఈ డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆవ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈమని నవీన్ గా గుర్తించగా.. అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ కేసులో నిందితుడి అరెస్ట్ అవడంపై స్పందించారు రష్మిక. ఈమేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.. నిందితులను పట్టుకున్నందుకు ఢిల్లీ పోలీస్ కి నా ధన్యవాదాలు. ఈ విషయంలో నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. అబ్బాయిలు, అమ్మాయిలు.. మీకు తెలియకుండానే మీ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అది కచ్చితంగా తప్పు. జాగ్రత్తగా ఉండండి.. అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.