
ప్రస్తుతం ఇండియాలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)నే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో డజను సినిమాలకు పైగానే ఉన్నాయి. అందులో దాదాపు అన్నీ పాన్ ఇండియా భారీ సినిమాలే కావడం విశేషం. ఇటీవలే యానిమల్(Animal) సినిమాతో బాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇపుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. సికందర్ పేరుతో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది.
ఇదిలా ఉంటే.. ఓపక్క సినిమాలతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా ఆమె ఒక నెటిజన్ షేర్ చేసిన వీడియోకి రిప్లై కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. రష్మిక నటించిన యానిమల్ సినిమాలోని ఒక సీన్ ని షేర్ చేస్తూ.. ఒక పురుషుడిని నమ్మడం అనే దానికంటే భయంకరమైంది ఇంకోటి లేదు.. అంటూ రాసుకొచ్చారు ఆ నెటిజన్. దానికి సమాధానంగా రష్మిక.. మీరు రాసినదాంట్లో చిన్న కరెక్షన్. ఒక పిచ్చివ్యక్తిని నమ్మడం అనేది భయం. కానీ, ఇక్కడ చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు. అలాంటి వారిని నమ్మితే స్పెషల్.. అంటూ రాసుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Remember nothing is scarier than trusting a man..#RanbirKapoor #RashmikaMandanna
— Falena? (@_ivsfa8) June 13, 2024
#TriptiDimri#Animal pic.twitter.com/DEAw6Dxhlf
ఇక రష్మిక మందన్నా చేస్తున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లోవస్తున్న ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తుండగా.. ఆగస్టు 15న విడుదల కానుంది ఈ మూవీ. ఇక ది గర్ల్ ఫ్రెండ్ అనే మరో సినిమాను కూడా చేస్తున్నారు రష్మిక. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవాకాశం ఉంది.