ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ .. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడిన పోలీస్ ఉన్నతాధికారులు

ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ .. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడిన పోలీస్ ఉన్నతాధికారులు

గండిపేట/పద్మారావునగర్/ముషీరాబాద్, వెలుగు: భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్​పటేల్ 148వ జయంతి సందర్భంగా గ్రేటర్ వ్యాప్తంగా రాష్ట్రీయ ఏక్తా దివస్(జాతీయ సమైక్యతా దినోత్సవం) వేడుకలు ఘనంగా జరిగాయి. హిమాయత్ సాగర్ పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నతాధికారులు, సిబ్బంది  ప్రతిజ్ఞ చేశారు.   కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్స్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ జానకి షర్మిల, అనసూయ, శ్రీరామమూర్తి, రాఘవరావు, అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్లు, డీఎస్పీలు, పోలీస్‌‌‌‌ సిబ్బంది పాల్గొన్నారు.

రాజేంద్రనగర్‌‌‌‌లోని ప్రొఫెసర్‌‌‌‌ జయశంకర్‌‌‌‌ అగ్రికల్చర్ వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్​లో రాష్ట్రీయ ఏక్తా దివాస్‌‌‌‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.  వర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ ఎం. వెంకటరమణ మాట్లాడుతూ..  దేశ సమైకత్య, సమగ్రతకి సర్దార్‌‌‌‌‌‌‌‌ వల్లభాయ్‌‌‌‌ పటేల్ చేసిన కృషి , స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిదన్నారు. మణికొండ మున్సిపాలిటీలో,  పద్మారావునగర్ లోని ఎస్‌‌‌‌పీ కాలేజీలో, గాంధీనగర్ లోని టీఆర్టీ బీఎంఎస్ ఆఫీసులో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. పటేల్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.