రేషన్‎కు వ్యాక్సినేషన్‎తో సంబంధం లేదు 

రేషన్‎కు వ్యాక్సినేషన్‎తో సంబంధం లేదు 

టీకా తీసుకోని వారికి రేషన్, పెన్షన్ బంద్ చేస్తామన్న హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలపై సివిల్ సప్లై అధికారులు స్పందించారు. రేషన్‎కు వ్యాక్సినేషన్‎తో ఎటువంటి సంబంధంలేదని తేల్చి చెప్పారు. టీకా వేసుకోకపోతే రేషన్ ఆపాలని ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. వ్యాక్సినేషన్ వైద్యారోగ్యశాఖకు సంబంధించిన విషయమన్నారు. మరోవైపు సెర్ప్ కూడా వ్యాక్సిన్‎తో పెన్సన్‎కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు తెలిపారు.