మొయినాబాద్ ఫాంహౌస్లో రేవ్ పార్టీ.. లిక్కర్, హుక్కాతో తిక్క తిక్క చేసిన ఆఫ్రికన్లు

మొయినాబాద్ ఫాంహౌస్లో రేవ్ పార్టీ.. లిక్కర్, హుక్కాతో తిక్క తిక్క చేసిన ఆఫ్రికన్లు

రేవ్ పార్టీలపై ఎన్ని రిస్ట్రిక్షన్స్ విధించినా చాటుమాటున పార్టీలు నడుస్తూనే ఉన్నాయి. లిక్కర్, డ్రగ్స్, హుక్కా.. ఇలా మత్తు పదార్థాలతో పార్టీలో ఎంజాయ్ చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. శుక్రవారం (ఆగస్టు 14) రాత్రి మొయినాబాద్ లోని ఓ ఫాం హౌస్ లో పర్మిషన్ లేకుండా పార్టీ చేసుకుంటున్న 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో వినియోగిస్తున్న మత్తు పదార్థాలను చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ లోని బాకారం ఫామ్ హౌస్ లో SOT, లోకల్ పోలీసులతో రైడ్ చేశారు. ఫాంహౌస్ పార్టీలో 51మందిని గుర్తించినట్లు తెలిపారు. అందులో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారు. వీళ్లలో ఆఫ్రికన్ కంట్రీ కి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఉగాండా, సినియన్, కెన్యా మరో రెండు ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు  గుర్తించారు పోలీసులు. 

ALSO READ : భయ్యా అమ్మాయి భయపడుతోంది, కార్ ఆపండి ప్లిజ్..

ఉగాండాకు చెందిన మమాస్ అనే మహిళ ఫాం హౌస్ లో బర్త్‌ డే పార్టీ నిర్వహించింది. ఈమె అక్రమంగా హైదరాబాద్ లో ఉంటున్నట్లు చెప్పారు పోలీసులు. వీసా గడువు ముగిసినా ఇల్లీగల్ గా ఉంటున్నట్లు గుర్తించారు. మమాస్ తన బర్త్ డే పార్టీలో లిక్కర్ పార్టీ నిర్వహించారు. మొత్తం 65 బీర్లు, 20 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు చెప్పారు పోలీసులు. 

ఎక్సైజ్, లోకల్ పోలీసుల పర్మిషన్ లేకుండా ఇష్టారీతిన పార్టీ నిర్వహిస్తున్నారు. అర్థరాత్రి విపరీతమైన సౌండ్ తో పార్టీ నిర్వహించారు. దీంతో సౌండ్ వయలేషన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇమిగ్రేషన్ అధికారులను పిలిపించి వీసాలు జెన్యూన్ గా ఉన్నాయా లేవా అని చెక్  చేస్తున్నారు. 51 మందిలో 12 మంది స్టూడెంట్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. 

పర్మిషన్ లేకుండా పార్టీ నిర్వహించడంపై నిర్వాహుకులతో పాటు ఫామ్ హౌస్ యజమాని పై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పాడు డీసీపీ శ్రీనివాస్. లిక్కర్ తో పాటు హుక్కా ను గుర్తించినట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు పూర్తైన తరువాత డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తామని అన్నారు. 

మొయినాబాద్ SK NATURE  ఫాంహౌస్ రేవ్ పార్టీలో పాల్గొన్న 25మంది నైజీరియన్ లకు ఇమ్మిగ్రేషన్ తనిఖీలు నిర్వహించారు అధికారులు. అందులో 19మంది నైజీరియన్ లు వీసా గడువు ముగిసిన తర్వాత ఉన్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. మిగతా 26 మందిపై తనిఖీలు కొనసాగుతున్నాయి. 6 గురి నైజీరియన్ లకు నోటీసులు ఇచ్చి పంపారు  పోలీసులు. ఈ ఆరుగురు విద్యార్ధులు వివిధ యూనివర్సిటీ లో చదువుతున్నట్టు గుర్తించారు. వీసా గడువు ముగిసిన వాళ్ళందరిని తిరిగి డిపోర్టేషన్ చేయనున్నారు.