భయ్యా అమ్మాయి భయపడుతోంది, కార్ ఆపండి ప్లీజ్..: క్యాబ్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్, చివరికి...

భయ్యా అమ్మాయి భయపడుతోంది, కార్ ఆపండి ప్లీజ్..: క్యాబ్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్, చివరికి...

ర్యాష్ డ్రైవింగ్ వల్ల డ్రైవరుకే కాదు తోటి ప్రయాణికులకు కూడా ప్రమాదం ఉంటుంది. కానీ కొంతమంది ఇప్పటికీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలో ఇలాంటి ఒక కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడా నుండి ఢిల్లీకి వెళ్లడానికి ఒక జంట క్యాబ్ బుక్ చేసారు. కానీ డ్రైవర్ దగ్గర వాహన పేపర్స్ లేవు. పోలీసులు అతన్ని పట్టుకుంటారేమో అని తప్పించుకునేందుకు ర్యాష్ డ్రైవింగ్ చేసాడు. 

క్యాబ్‌లో కూర్చున్న జంట అతన్ని క్యాబ్ ఆపమని చెప్పగా, కానీ డ్రైవర్ వారిని పట్టించుకోకుండా కారును స్పీడుగా నడుపుతూ వెళ్ళాడు. దింతో ఆ జంట కూతురు భయపడి, ఏడవడం ప్రారంభించింది. అప్పుడు ఆ జంట డ్రైవర్‌ను ఎంతగా బ్రతిమాలిన డ్రైవర్ మాట వినలేదు, ఇంకా హైవేపై ఓవర్ స్పీడుతో వెళ్ళాడు. 

క్యాబ్‌లో కూర్చున్న ప్రయాణికుడు డ్రైవరుతో అన్నా ఇలా డ్రైవ్ చేయకు, మాతో పాప ఉంది. ఆమె భయపడుతుంది. మీరు పోలీసులను చూసి భయపడితే, నాకు చెప్పండి మేము వారితో మాట్లాడతాము. లేకపోతే  మమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేయండి. మీకు డబ్బులు కూడా ఇస్తాము. కానీ ఇలా డ్రైవ్ చెయ్యొద్దు అని అన్నారు. అయినా కూడా  డ్రైవర్ వాళ్ళని  పట్టించుకోకుండానే ఉన్నాడు. చివరికి అతని భార్య కూడా భయ్యా కారు ఆపండి  దయచేసి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేయండి అని కోరింది. దింతో డ్రైవర్ నేను మిమ్మల్ని సురక్షితంగా డ్రాప్ చేస్తాను అని చెప్పగా అకస్మాత్తుగా ఒక కారు ముందు వచ్చింది. దింతో క్యాబ్ ఆ కారుని ఢీకొట్టింది. అదే సమయంలో క్యాబ్ డోర్స్ తీసి ఆ జంట బయటకి దిగింది. 

►ALSO READ | బెంగళూరులో పేలుడు : ఇల్లు కుప్పకూలి చిన్నారి మృతి

సమాచారం ప్రకారం, క్యాబ్ ప్రయాణికుడు సంజయ్ మోహన్ గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని అజ్నారా హోమ్స్ సొసైటీలో ఉంటున్నాడు. అతను తన భార్య, కుమార్తెతో కలిసి గ్రేటర్ నోయిడా వెస్ట్ నుండి సీపీకి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సంజయ్ మోహన్ ప్రకారం డ్రైవర్ పదే పదే ఎంత చెప్పిన స్పీడ్ తగ్గించలేదు ఇంకా చాల నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు. ఈ స్పీడ్  వల్ల  ముందు ఉన్న ఓ వాహనాన్ని క్యాబ్ ఢీకొందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డ్రైవర్ పై చర్యలు: సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించి ఫేజ్-3 పోలీస్ స్టేషన్ వెంటనే చర్య తీసుకుని క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంది. అలాగే సంబంధిత వాహనాన్ని చలాన్ వేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు ఫెయిల్  చేసి  అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.