బెంగళూరులో పేలుడు : ఇల్లు కుప్పకూలి చిన్నారి మృతి

బెంగళూరులో పేలుడు : ఇల్లు కుప్పకూలి చిన్నారి మృతి

 బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌లో నేడు ఉదయం జరిగిన సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా మరో తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే ఉదయం 8 గంటల సమయంలో ఈ విషాద సంఘటన  జరిగింది. అలాగే ఒక ఇంటి భవన సముదాయంలో భారీ నష్టం వాటిల్లింది, చాల ఇళ్ళు కూలిపోయాయి, పక్కన ఉన్న ఇళ్ళు కూడా పాక్షికంగా ధ్వంసమైంది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్, సీనియర్ అధికారులతో కలిసి పేలుడు స్థలాన్ని పరిశీలించారు. మొదట సిలిండర్ పేలినట్లు అనిపించినా ఖచ్చితమైన కారణం కోసం దర్యాప్తు చేస్తున్నారని  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. 

మృతుడిని ముబారక్ అనే చిన్న బాలుడిగా గుర్తించారు. వీరిలో కస్తూరమ్మ, నరస్మ సహా మరో తొమ్మిది మంది తీవ్రంగా కాలిన గాయాలతో నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నామని, ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.  

బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. స్థానిక పోలీసులు, డిసిపి,   జాయింట్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 7-8 ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి, మరో 7-8 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

ALSO READ : అమ్మ కడుపుతో అద్దె వ్యాపారం..