కొంత మంది నా వైఫల్యాన్ని కోరుకున్నారు

కొంత మంది నా వైఫల్యాన్ని కోరుకున్నారు

లండన్‌‌: తన బాధ్యతలను ఎంత బాగా నిర్వర్తించినా విఫలం కావాలని కోరుకునే ఓ జలస్‌‌ గ్యాంగ్‌‌ ఇండియాలో ఉండేదని టీమిండియా మాజీ కోచ్‌‌ రవిశాస్త్రి అన్నాడు. ఎప్పుడు తాను విఫలమవుతానా.. ఎప్పుడు నిందలు వేద్దామా అని ఎదురుచూసేవారన్నాడు. ‘కోచింగ్‌‌లో నాకు లెవెల్‌‌ 1, 2 అనే బ్యాడ్జీలు లేవు. కానీ, ఇండియాలో నాకు వ్యతిరేకంగా ఓ జలస్‌‌ గ్యాంగ్‌‌ ఉండేది. వాళ్లు ఎప్పుడూ నా వైఫల్యాన్నే కోరుకునేవారు. ఈర్ష్యతో ఉన్నవారిని ఎదుర్కోవాలంటే మన చర్మం చాలా మందంగా, డ్యూక్‌‌ బాల్‌‌ తయారీకి వాడే లెదర్‌‌ కంటే గట్టిగా ఉండాలని ఇంగ్లండ్‌‌ క్రికెట్‌‌ బోర్డు (ఈసీబీ) డైరెక్టర్‌‌ రాబర్ట్‌‌ కీ చెప్పేవారు. ఈసీబీ డైరెక్టర్‌‌గా పని చేసే టైమ్‌‌లోనూ తను అలాంటి బాధలే ఎదుర్కొన్నారు. నాకు కూడా ఇండియాలో అలాంటి అనుభవమే ఎదురైంది. అయినా నేను వదిలిపెట్టలేదు. ఎందుకంటే నా చర్మం కూడా చాలా మందం. డ్యూక్‌‌ బాల్‌‌ కంటే చాలా గట్టిది. నాకు కెప్టెన్సీ అనుభవం ఉండటం వల్ల ప్లేయర్లతో కమ్యూనికేషన్‌‌కు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు’ అని శాస్త్రి పేర్కొన్నాడు.